Gang Rape

Gang Rape: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్‌ బాలికపై హోటల్‌లో గ్యాంగ్ రేప్

Gang Rape: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం కారణంగా ఒక మైనర్ బాలిక దారుణానికి గురైంది. స్నేహం పేరుతో పరిచయమైన ఒక వ్యక్తి ఆ బాలికను మాయమాటలతో నమ్మించి హోటల్‌కు రప్పించాడు. అక్కడ మరో ఇద్దరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ షాకింగ్ ఘటనలో 15 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు బంధించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

ఇన్‌స్టాగ్రామ్ మాయ:
ఏడవ తరగతి చదువుతున్న ఆ బాలికకు నిందితుల్లో ఒకరితో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తి బాలికను చాలా తెలివిగా మోసం చేసి, మదియాన్వ్‌లోని ఐఐఎం రోడ్డులో ఉన్న ఒక హోటల్‌కు పిలిపించాడు. నవంబర్ 2వ తేదీ రాత్రి, నిందితులు ఆ బాలికను ఒక స్కార్పియో కారులో హోటల్‌కు తీసుకువచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు.

రెండు రోజులు బందీ:
నిందితులు బాలికను కేవలం ఒక్క రాత్రి మాత్రమే కాకుండా, రెండు రోజుల పాటు బందీగా ఉంచి విమల్, పియూష్ అనే ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం గురించి బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు తన కూతురి శరీరాన్ని కొరికి, ఆమె మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారని, గదిలో బంధించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

బెదిరింపులు.. పరారీ:
ఆ బాలిక ఎంత వేడుకున్నా కూడా నిందితులు కనికరించలేదు. చివరికి, పదే పదే వేడుకున్న తర్వాత నిందితులు ఆ బాలికను ఇంటి దగ్గర వదిలి పారిపోయారు. అయితే, ఈ దారుణం గురించి ఎవరికైనా చెబితే, తమ వద్ద ఉన్న వీడియోలను ఇంటర్నెట్‌లో వైరల్ చేస్తామని బాలికను బెదిరించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే పియూష్, శుభం మిశ్రా అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బాలికను వైద్య పరీక్షల కోసం పంపిస్తామని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *