71st National Film Awards: దేశ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం నేడు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా జరిగింది. 2023 సంవత్సరానికి గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను అందించారు. ఈసారి పలు తెలుగు చిత్రాలు కూడా జాతీయ స్థాయిలో సత్తా చాటడం విశేషం.
అవార్డుల విజేతలు వీరే:
వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి:
* ఉత్తమ జాతీయ చిత్రం: ’12th ఫెయిల్’ (హిందీ)
* ఉత్తమ నటులు: ‘జవాన్’ సినిమాకు షారుఖ్ ఖాన్, ’12th ఫెయిల్’ సినిమాకు విక్రాంత్ మస్సే
* ఉత్తమ నటి: ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమాకు రాణి ముఖర్జీ
* ఉత్తమ తెలుగు చిత్రం: ‘భగవంత్ కేసరి’
* ఉత్తమ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ: ‘హనుమాన్’
* ఉత్తమ సాహిత్యం (లిరిక్స్): ‘బలగం’ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాట
* ఉత్తమ స్క్రీన్ ప్లే: ‘బేబి’ సినిమాకు సాయి రాజేష్ నీలం
* ఉత్తమ నేపథ్య గాయకుడు (మెయిల్ ప్లేబ్యాక్ సింగర్): రోహిత్
* ఉత్తమ బాల నటి (చైల్డ్ ఆర్టిస్ట్): ‘గాంధీ తాత చెట్టు’ సినిమాకు సుకృతి వేణి బండ్రెడ్డి
ఈ అవార్డులు తెలుగు సినిమా స్థాయిని పెంచాయని, భవిష్యత్తులో మరిన్ని జాతీయ అవార్డులు సాధించాలని సినీ ప్రముఖులు ఆకాంక్షించారు.