70MM Entertainments: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సమర్పణలో 70MM ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వచ్చిన యాత్ర 2, రాజకీయ నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకొచ్చి మిశ్రమ స్పందన పొందింది. మహి వి రాఘవ దర్శకత్వంలో మమ్ముట్టి, జీవా నటించిన ఈ చిత్రం తర్వాత, ఈ బ్యానర్ ఇప్పుడు ఐదు కొత్త సినిమాలతో సందడి చేయనుంది. స్మాల్, మిడ్ రేంజ్ హీరోలైన నాగ శౌర్య, గోపీచంద్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆకాష్ పూరితో ఈ చిత్రాలు రూపొందనున్నాయి. ఆగస్టు రెండో వారంలో ప్రకటనలతో పాటు షూటింగ్ కూడా షురూ కానుంది. సుధీర్ బాబు ఈ బ్యానర్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు చేశారు. మహి వి రాఘవ ఈ ప్రాజెక్ట్‌లలో ఒకటి తీసే అవకాశం ఉంది. ఈ యంగ్ హీరోలతో హిట్ కొట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దర్శకుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
