దానా తుపాను ఎఫెక్ట్ తో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే భారత రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో సుమారు 70 రైళ్లు క్యాన్సిల్ చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కే సందీప్ వెల్లడించారు. 23వ తేదీన ఏకంగా 18 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.
క్యాన్సిల్ అయిన రైలు సర్వీసులు పరిశీలిస్తే… బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-హావ్‌డా ఈస్ట్‌కోస్టు, కన్యాకుమారీ-డిబ్రూఘర్ కన్యాకుమారీ, సికింద్రాబాద్-హావ్‌డా ఫలక్‌నుమా, ముంబయి-భువనేశ్వర్ కోణార్క్, చెన్నై సెంట్రల్-హావ్‌డా మెయిల్ తదితర రైళ్లు ఉన్నాయి.
ఇక 24న 37 రైళ్లు రద్దు అయ్యాయి. వాటిలో భువనేశ్వర్-విశాఖ వందేభారత్, షాలిమార్-వాస్కోడిగామా అమరావతి ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్,హావ్‌డా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా, పట్నా-ఎర్నాకుళం తదితర రైలు సర్వీసులు ఉన్నాయి.
ప్రయాణికులు పై తెలిపిన వివరాల ప్రకారం వేరే మార్గంతో వారి గమ్య స్థానానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
