Ap news: కొత్తగా 53 జూనియర్ కళాశాలలు

Ap news: కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థపై సమూల మార్పు తేవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఏపీలో కొత్తగా 53 జూనియర్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 37 మండలాలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. 37 మండలాల్లో 47 కళాశాలలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ఆరు కళాశాలలు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ ఆమోదించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ambati Rambabu: పోలవరంపై చర్చకు సిద్ధం.. చంద్రబాబు నిర్లక్ష్యమే ప్రాజెక్టు నాశనానికి కారణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *