52 Kg Gold In Car: ఓరిని ఎక్కడిదిరా ఈ మనీ. కేజీల కొద్దీ బంగారాన్ని వారిలో వేసుకుని ఎక్కడికిపోతున్నావ్. నలభై కోట్ల డబ్బు …యాభై రెండు కేజీల బంగారం. వామ్మో అనేలా ఉంది కదా..కానీ జరిగింది ఇది. ఎక్కడో కాదు. మన దేశంలోనే. సినీ ఫక్కీలో …రెడ్ హ్యండెడ్ గా పోలీసులకు దొరికిపోయారు. ఇంతకీ ఎవరిది ఈ డబ్బు , బంగారం . ఆ లెక్కలే ఇప్పుడు బయటకు రావాలి. లెక్కలు బయటపెట్టడమే కాదు..బొక్కలో కూడా వేస్తాం అంటున్నారు పోలీసులు
మధ్యప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ సంస్థల అవినీతిపై వరుస దాడులతో అవినీతి తిమింగలాలు బయటపడుతున్నాయి. నగరంలోని భారీ స్థాయిలో పన్నుల్ని ఎగవేస్తున్న అక్రమార్కులపై దాడులతో జరుగుతుండగా.. వాటిని నుంచి తప్పించుకునేందుకు తిప్పలు పడుతున్నారు.
52 Kg Gold In Car: ఈ క్రమంలోనే ఏకంగా 52 కేజీల బంగారం, రూ.40 కోట్ల నగదు తరలిస్తున్న ఓ కారు.. భోపాల్ లోని అడవీ ప్రాంతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ కు పట్టుబడింది. దీంతో.. ఇలాంటి డబ్బు, అభరణాలు ఏ మేరకు దొంగదారిలో తప్పించుకుపోతున్నాయో అంటూ చర్చలు మొదలైయ్యాయి. ఈ కారును ఛేదించేందుకు పోలీసులు.. సినిమాల్లో చూపించేలా భారీ ఆపరేషన్ చేపట్టడంతో ఆసక్తిగా మారింది.
భోపాల్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల కార్యకలాపాలపై కొన్నాళ్లుగా దృష్టి పెట్టిన ఐటీ డిపార్ట్మెంట్.. ప్రభుత్వానికి చెల్లిచాల్సిన పన్నులు పెద్ద మొత్తంలో ఎగవేస్తున్నట్లు గుర్తించింది. దీంతో.. వారికి అనుమానులున్న సంస్థలపై వరుసగా సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో.. ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ తో పాటు ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, లోకాయుక్త సంయుక్తంగా పాల్గొంటున్నాయి. ఈ క్రమంలోనే అక్రమాస్తుల్ని దొంగ దారుల్లో తప్పించేందుకు.. కొందరు ప్రయత్నిస్తున్నారు. అందులో ఓ రియాల్టర్ కి చెందిన భారీ అక్రమాస్తుల్ని ఈడీ గుర్తించి, స్వాధీనం చేసుకుంది.
52 Kg Gold In Car: తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఐటీ అధికారులకు అక్రమ నగదు, బంగారాన్ని తరలిస్తున్నట్లుగా ఓ సమాచారం అందింది. దాంతో.. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. ఏకంగా వంద మంది పోలీసులు, 30 వాహనాలతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అధికారుల నిఘాలోని ఓ రియల్టర్ పేరుపై రిజిస్టర్ అయిన కారులో ఈ నగదు తరలిపోతున్నట్లు తెలియడంతో.. వీరంతా ఆ కారును వెంబడించి భోపాల్ లోని మిండోరీ అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు.