Crime News: హైదరాబాద్‌లోని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పనికి బయలుదేరిన తండ్రికి నవ్వుతూ “బై బై” చెప్పిన ఐదేళ్ల చిన్నారి.. కానీ అదే చివరి బై బై అవుతుంది అని కుటుంబాన్ని దుఃఖంలో ముంచెత్తాడు అని అనుకోలేదు.
ఎలా జరిగింది?
పటేల్‌గూడలో నివసిస్తున్న చిన్నారి ఇంటి బాల్కనీలో ఆడుకుంటూ రైలింగ్ పట్టుకుని వాలాడు. ఆడుతూ ఆడుతూ సమతుల్యం కోల్పోయి కింద పడిపోయాడు. దురదృష్టవశాత్తు ఇంటి గేటు మీద తల బలంగా తగలడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇది కూడా చదవండి: Donald Trump: ట్రంప్ హెచ్చరిక.. యుద్ధాన్ని ఆపాలా? వద్దా?
చిన్నారి వివరాలు
మృతి చెందిన బాబు వనపర్తి జిల్లా బలజపల్లి గ్రామానికి చెందిన మింగ గురుమూర్తి – నందిని దంపతుల కుమారుడు. ఐదేళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు.
కన్నీటి ముద్దు బిడ్డ
అప్పటి వరకు ఆడుతూ పాడుతూ అల్లరి చేసిన చిన్నారి ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా రోదించారు.