AA22: సినిమా ప్రియులకు ఓ సంచలన వార్త! #AA22 సినిమా ఎంట్రీ సీన్ కోసం 300 మంది కళాకారులు, అత్యాధునిక టెక్నాలజీతో కలిసి ఓ విజువల్ వండర్‌ని సృష్టిస్తున్నారు. ఈ సీన్‌లో అతిపెద్ద సెట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, హై-ఎండ్ VFX ఉంటాయని తెలుస్తోంది. అల్లు అర్జున్, దీపికా ప్రధాన పాత్రల్లో, అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారత సినిమా ప్రమాణాలను మార్చేసే అవకాశం ఉందని టాక్. ఈ సీన్ కోసం భారీ బడ్జెట్ కేటాయించగా, ఇది ప్రేక్షకులకు ఊహించని అనుభవాన్ని అందిస్తుందని టీమ్ ధీమాగా ఉంది.
