3 Idiots: ఆమీర్ ఖాన్ కెరీర్లో వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన 3 ఇడియట్స్ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో ఇంకో కొత్త క్యారెక్టర్ కూడా ఉండబోతుందట. అందుకోసం వేరే నటుడిని వెతుకుతున్నారట. ఈ సీక్వెల్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Dandora: దూసుకుపోతున్న ‘దండోరా’ ట్రైలర్!
బాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ క్లాసిక్ చిత్రం 3 ఇడియట్స్.. ఫైనల్ గా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. అగ్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ మళ్ళీ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. అయితే సీక్వెల్‌కు 4 ఇడియట్స్ అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. ఎందుకంటే ఇందులో మరో కొత్త క్యారెక్టర్ ఉంటుందట. ఆ పాత్రకు తగిన నటుడిని ప్రస్తుతం వెతుకుతున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ సాగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్‌ను గ్రాండ్ గా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. 3 ఇడియట్స్ సినిమా ఉన్నత విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ సినిమాని నన్బన్ పేరుతో తమిళంలో శంకర్ – విజయ్ రీమేక్ చేశారు. ఈ రీమేక్ తెలుగులో స్నేహితుడి పేరుతో డబ్ అయింది. ఇప్పుడు ఇలాంటి సినిమాకు సీక్వెల్ రావడం అభిమానుల్లో భారీ అంచనాలను రేపుతోంది.

