Kabaddi Player: పంజాబ్‌లో దారుణం చోటు ఘటన చేసుకుంది. లూథియానా జిల్లాలోని జాగ్రావ్‌లో శుక్రవారం (అక్టోబర్ 31) పట్టపగలు ఒక కబడ్డీ ఆటగాడిని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన ఎస్ఎస్పీ కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న హరి సింగ్ హాస్పిటల్ రోడ్‌లో జరిగింది.
పాత కక్షలతో హత్య
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, మరణించిన ఆటగాడిని బెట్ ప్రాంతంలోని గిద్దెర్విండి గ్రామానికి చెందిన తేజ్‌పాల్ సింగ్ (26) గా గుర్తించారు. తేజ్‌పాల్ సింగ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి హరి సింగ్ రోడ్‌లోని ఒక ఫ్యాక్టరీకి నడుచుకుంటూ వెళుతుండగా ఈ దాడి జరిగింది. పాత శత్రుత్వం కారణంగా మరొక గ్రూపునకు చెందిన యువకులతో గొడవ జరిగింది. ఈ ఘర్షణ చివరకు హత్యకు దారి తీసింది. ఘర్షణ తీవ్రమవడంతో, ప్రత్యర్థి గ్రూపునకు చెందిన ఒక యువకుడు తన రివాల్వర్‌తో తేజ్‌పాల్ ఛాతీపై కాల్పులు జరిపాడు.
ఇది కూడా చదవండి: Hyderabad: తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఆసుపత్రిలో మృతి
తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన తేజ్‌పాల్‌ను అతని స్నేహితులు హుటాహుటిన కారులో సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే తేజ్‌పాల్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
పోలీసుల చర్యలు:
ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, సిటీ పోలీస్ స్టేషన్ అధికారులు, CIA సిబ్బందితో సహా పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిపిన నిందితులను పట్టుకోవడానికి లూథియానా పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. కబడ్డీ ఆటగాడి హత్యతో జాగ్రావ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

