Uttarakhand: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో 16 ఏళ్ల మైనర్ బాలుడిని 25 ఏళ్ల టీచర్ వివాహం చేసుకుంది. దీనిపై అక్కడి ప్రజల ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్నారు. నకిలీ పత్రాలతో వివాహాన్ని నమోదు చేశారంటూ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యార్థులు తెలిసి తెలియని వయసులో ప్రేమించుకుంటే అది తప్పు అని చెప్పి వాలని ఒక దారిలో ఫెటే టీచర్ లని మనం చూశాం. కానీ ఈ టీచర్ చేసిన పని చుస్తే మాత్రం ఎవరికి ఐన కోపం రావలిసిందే. ఓ టీచర్ మైనర్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు షాక్‌కు గురై టీచర్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: Pushpa 2 Review: పుష్ప.. మాస్ అనుకుంటిరా.. వైల్డ్ మాస్!
Uttarakhand: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని స్థానిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న 25 ఏళ్ల యువతికి కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా మీరట్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల టీచర్ మీరట్‌కు కారులో వెళ్లి బాలుడిని కారులో ఘజియాబాద్‌కు తీసుకెళ్లింది. ఘజియాబాద్ లోనే అబ్బాయి మేజర్ అని నకిలీ పత్రం సృష్టించి పెళ్లి రిజిస్టర్ చేయించుకుంది. కొడుకు పెళ్లి విషయం తెలిసి షాక్‌కు గురైన బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ అయినప్పటికి తమ కుమారుడిని టీచర్ భయపెట్టి, నకిలీ పత్రం సృష్టించారని తల్లిదండ్రులు ఆరోపించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అబ్బాయి అంగీకారంతో ఈ వివాహం జరిగినప్పటికీ, దీనికి చట్టబద్ధత లేదు. భారతీయ చట్టం ప్రకారం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తితో వివాహం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు మీడియాకు తెలిపారు.