Udhayanidhi Stalin: ప్రస్తుత తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఎమ్.ఎల్.ఏ కాకముందే బిజీ హీరో. అయితే రాజకీయాల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమైన తర్వాత ‘మామన్నన్’ తన చివరి సినిమాగా ప్రకటించాడు. కానీ దానికంటే ముందు ఆదయమాన్ దర్శకత్వంలో ‘ఏంజెల్’ అనే సినిమాలో నటించాడు ఉదయనిధి. ఇందులో పాయల్ రాజ్ పుత్, ఆనంది హీరోయిన్స్. 2018లో మొదలైన ఈచిత్రం 80శాతం పూర్తయింది. దాదాపు 13 కోట్ల ఖర్చు అయినట్లు నిర్మాత రామశరవణ్ చెబుతున్నారు. అయితే అవాంతరాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఎన్నికలకు ముందు ‘మా మన్నన్’ తన చివరి చిత్రమని ఉదయనిధి ప్రకటించటంతో ఈ సినిమా పూర్తిగా ఆగిపోయింది. దీంతో నిర్మాత హై కోర్టులో పిటీషన్ వేస్తూ ఉదయనిధి సహకరించకపోవడం వల్లే నష్టం వచ్చిందంటూ 25కోట్ల నష్టపరిహారం కేసు వేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు 28కి తీర్పును వాయిదా వేసింది. మరి కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో చూడా

