Maoists: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో శాంతి ఆశాజ్యోతి మెరుస్తోంది. బీజాపూర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం 24 మంది మావోయిస్టులు అధికారుల సమక్షంలో లొంగిపోయారు. వీరిలో పీఎల్జీఏ ప్లాటూన్ నంబర్ 2కు చెందిన డిప్యూటీ కమాండర్ రాకేశ్ ప్రధానంగా ఉన్నాడు. అతనిపై ప్రభుత్వానికి రూ.10 లక్షల రివార్డు ఉంది. మొత్తం లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న బహుమతి మొత్తంగా రూ.87 లక్షలు.
సీఆర్‌పీఎఫ్ డీఐజీ రాకేశ్ కుమార్, బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, ఏఎస్పీ మయాంక్ గుజుర్‌ల సమక్షంలో ఈ లొంగింపు జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం కింద, ఒక్కో మావోయిస్టుకు తక్షణ ప్రోత్సాహకంగా రూ.25,000 చొప్పున అందజేశారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. అర్థరాత్రి ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అత్యంత కీలకమైన మావోయిస్టు నేతలు లొంగిపోవడంతో భద్రతా బలగాలు, ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నాయి. ఇదే సమయంలో స్థానిక ప్రజల్లోనూ భద్రతాపట్ల విశ్వాసం పెరుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన “లొంగింపు – పునరావాసం” కార్యక్రమానికి ఇది మరొక విజయ ఘట్టంగా నిలిచింది.
అధికారుల ప్రకటన:
ఈ మావోయిస్టుల లొంగింపుతో పాటు, వారు ప్రజల ప్రధానవాగ్దానాన్ని అంగీకరించడం సమాజానికి మంచి సంకేతం. భవిష్యత్తులో మరింతమంది లొంగిపోవడానికి ఇది మార్గం వేసే అవకాశం ఉంది అని డీఐజీ రాకేశ్ కుమార్ తెలిపారు.
