Company: రామ్ గోపాల్ వర్మ (RGV) దర్శకత్వంలో 2002లో విడుదలైన ‘కంపెనీ’ చిత్రం 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఇండియన్ సినిమాలో ఓ మైలురాయిగా నిలిచింది. అజయ్ దేవగణ్, వివేక్ ఒబెరాయ్, మోహన్‌లాల్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ముంబై అండర్‌వరల్డ్‌ను అత్యంత వాస్తవికంగా చూపించింది. దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ మధ్య జరిగిన వైరాన్ని ఆధారంగా చేసుకుని RGV ఈ కథను తెరకెక్కించారు.
‘కంపెనీ’లో అజయ్ దేవగణ్ పోషించిన మాలిక్ పాత్ర, వివేక్ ఒబెరాయ్ చేసిన చందు పాత్ర అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మోహన్‌లాల్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంది. ఈ సినిమా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 3 IIFA అవార్డులతో పాటు బెస్ట్ డైరెక్షన్‌కు బాలీవుడ్ మూవీ అవార్డును గెలుచుకుంది. ఆస్టిన్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన ఈ చిత్రం, గ్యాంగ్‌స్టర్ జానర్‌లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. RGV ఈ సినిమాతో భారతీయ సినిమాలో వాస్తవికతకు కొత్త నిర్వచనం ఇచ్చారని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు!