2025 Sankranthi Movies: పుష్ప2’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక క్రిస్మస్, సంక్రాంతి సినిమాలపై దృష్టి మరలుతోంది. ప్రత్యేకించి సంక్రాంతితో తెలుగు చిత్రరంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. మన హీరోలు, దర్శకనిర్మాతలు తమ తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలని తపిస్తుంటారు. దానికి తగ్గట్లే 2025 సంక్రాంతి రేసులో నిలిచే సినిమాలేవో తేలింది. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ ‘ఢాకూ మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు రాబోతున్నాయి. వీటిలో ‘గేమ్ ఛేంజర్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీలో బౌన్స్ బ్యాక్ అవ్వాలని శంకర్ భావిస్తున్నారు. ఈ నెల 21న డల్లాస్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.
ఇది కూడా చదవండి: Amaran: ఓటీటీలోనూ ట్రెండింగ్ లో ‘అమరన్’!
2025 Sankranthi Movies: ఈ సినిమా కోసమే చిరు ‘విశ్వంభర’ను వాయిదా వేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో పాటు మూడు పాటలకు మంచి స్పందన లభించింది. ఇక బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ జనవరి 12న ఆడియన్స్ ముందుకు రానుంది. షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి విఎఫ్ ఎక్స్ పనుల్లో ఉంది టీమ్. లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ అయి సినిమాపై అంచనాలు పెంచేసింది. ‘పుష్ప2’ మ్యానియా తగ్గగానే ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయనున్నారు. ఇక వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ను ఇటీవల ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయి ట్రెండింగ్ లో ఉంది. పరాజయం ఎరుగని దర్శకుడుగా రాజమౌళి తర్వాత ముద్ర పడ్డ అనిల్ రావిపూడి దర్శకుడు కావటం సినిమాకు ఎస్సెట్. సో ఈ మూడు సినిమాలు సంక్రాంతి పోరుకు రెడీ అవుతున్నాయి. మరి వీటిలో విజేతగా నిలిచేది ఎవరన్నది చూడాలి.