Akkineni Heroes: 2025 అక్కినేని అభిమానులకు సంబరంగా మారింది! నాగ చైతన్య తన ‘తండేల్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. సాయి పల్లవితో కలిసి నటించిన ఈ చిత్రం అభిమానులను ఉర్రూతలూగించింది. మరోవైపు, నాగార్జున ‘కుబేర’ సినిమాతో కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల మార్క్‌ను అందుకుని, తన స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించారు. ధనుష్‌తో కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక, యంగ్ హీరో అఖిల్ అక్కినేని కూడా తన రాబోయే చిత్రం ‘లెనిన్’తో 100 కోట్ల క్లబ్‌లో చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్ లుక్‌తో అఖిల్ అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. నాగార్జున నిర్మాణంలో, శ్రీలీల హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
