balu

Balu: 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ”బాలు ABCDEFG”

Balu: అంతకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’తోనే దర్శకునిగా మారిన కరుణాకరన్ తరువాత తన తొలి హీరోతో తీసిన చిత్రం ‘బాలు’. ఈ సినిమాకు ‘ఏబీసీడీఈఎఫ్ జి’ అనీ ఉంటుంది.అంటే ‘ఏ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ఏ గర్ల్’ అని దాని అర్థమట! ఇంత క్రియేటివిటీగా టైటిల్ రూపొందించిన కరుణాకరన్ ‘బాలు’ను పాత పంథాలోనే పయనింప చేశారు. 2005 జనవరి 6న విడుదలైన ఈ చిత్రాన్ని సి.అశ్వనీదత్ నిర్మించారు. ఇందులో శ్రియ, నేహా ఓబెరాయ్ నాయికలుగా నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ బాణీలు కట్టారు. సినిమా విడుదలకు ముందు అభిమానుల్లో భలే క్రేజ్ నెలకొంది. ఈ చిత్రం కూడా ‘తొలిప్రేమ’ రేంజ్ లో సక్సెస్ రూటులో సాగుతుందని ఆశించారు. అయితే ఫ్యాన్స్ ను నిరాశ పరచిందీ చిత్రం. కొన్ని పాటలు మాత్రం జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Game Changer: ‘గేమ్ ఛేంజర్’ సెన్సార్ పూర్తి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *