Hyderabad: హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కాచిగూడ పరిధి సుందర్‌నగర్‌లో ఓ ఇంట్లో ఏసీ నుంచి మంటలు చెలరేగడంతో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది.
సమాచారం ప్రకారం, ఇంట్లోని గదిలో ఏసీ అకస్మాత్తుగా మంటలు రావడంతో అప్పటికే అక్కడ ఉన్న బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మంటల కారణంగా అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
బాలుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
