Road Accident

Road Accident: లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు జవాన్లు మృతి

Road Accident: జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. CRPF జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలోకి జారిపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించబడ్డాయి. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు కూడా స్వచ్ఛందంగా సహాయానికి ముందుకొచ్చారు.

ఈ ఘటనపై కేంద్ర సహాయ మంత్రి & ఉధంపూర్ ఎంపీ డా. జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ ప్రమాదాన్ని ఆయన “కలవరపరిచే విషయం”గా అభివర్ణించారు. ఉధంపూర్ డిప్యూటీ కలెక్టర్ సలోని రాయ్తో మాట్లాడి పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *