1993 Deoband blast case

1993 Deoband blast case: అప్పుడు పేలుళ్ల కేసులో నిందితుడు ఇప్పుడు అరెస్ట్!

1993 Deoband blast case: 1993 దేవబంద్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు నజీర్ అహ్మద్ వానీని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో అతన్ని పట్టుకున్నారు.  నిన్న అధికారులు ఈ సమాచారాన్ని అందించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహాయంతో యుపి పోలీసు బృందం వనీని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. వాని  అరెస్ట్ పోలీసులకు పెద్ద విజయం.

జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బుద్గాం అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై వానీ పోటీ చేశారు. అయితే, అతను ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పోలీసు అధికారి ప్రకారం, 51 ఏళ్ల నజీర్ అహ్మద్ వానీ తన ఎన్నికల అఫిడవిట్‌లో తన వృత్తిని వ్యాపారంగా పేర్కొన్నాడు. 1993లో జరిగిన పేలుళ్ల కేసులో బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ అఫిడవిట్‌లో దేవ్‌బంద్ పేలుళ్ల కేసును ఆయన ప్రస్తావించలేదు.

1993 Deoband blast case: 1993లో జరిగిన పేలుడులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసులు సహా నలుగురు గాయపడ్డారు. నజీర్ అహ్మద్ వనీ 1993లో అరెస్టయ్యాడు. 1994లో బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే ఆ తర్వాత బెయిల్‌ షరతులు పాటించకుండా పరారీలో ఉన్న నజీర్‌ అహ్మద్‌ వనీ గత 31 ఏళ్లుగా రూపురేఖలు మార్చుకుని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నట్లు సమాచారం. గత ఏడాది బుద్గామ్ జిల్లాలో ఇతనిపై తప్పుడు నిర్బంధం మరియు క్రిమినల్ బెదిరింపు కేసు కూడా నమోదైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kerala Tourism Places: కేరళలోని ఈ అద్భుతమైన ప్రదేశాలు.. జీవితంలో ఒక్కసారయినా చూడాలి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *