OTT platform: 18 ఓటిటీ ప్లాట్ ఫాంలపై బ్యాన్.. కేంద్రం కీలక నిర్ణయం..

OTT platform: ఇన్‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి ఎల్. మురుగన్ ప్రకటించిన వివరాల ప్రకారం, అసభ్యకరమైన హానికరమైన కంటెంట్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో, 2021లో రూపొందించిన కొత్త ఐటీ రూల్స్ ప్రకారం, డిజిటల్ మీడియా పబ్లిషర్లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎలా నడుచుకోవాలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

ఈ రూల్స్ ప్రకారం, అసభ్యకరమైన కంటెంట్ ప్రసారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హానికరమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఈ ఏడాది మార్చి 14న బ్యాన్ చేసినట్టు మంత్రి వెల్లడించారు.

ఈ చర్యల ద్వారా ప్రజల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, సమాజంలో సాంస్కృతిక విలువలను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.

మంత్రి ఎల్. మురుగన్ పార్లమెంటు లోక్‌సభలో మాట్లాడుతూ, ఇటువంటి రూల్స్ అమలుపై ప్రభుత్వం పూర్తి నిశ్చయంతో ఉందని తెలిపారు. అసభ్యకరమైన కంటెంట్‌ను నిరోధించడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తున్నాయని చెప్పవచ్చు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  BJP New President: బిజెపి జాతీయ అధ్యక్షుడు ఎవరు అవుతారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *