Dussehra: దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో, కొత్త అల్లుడిని సత్కరించడం అనేది ఒక గొప్ప సాంప్రదాయం. ఈ ఆతిథ్యం చూపించడానికి అత్తమామలు తమ ప్రేమను మరియు ఆప్యాయతను చాటుతూ 101 (లేదా అంతకంటే ఎక్కువ) రకాల వంటకాలతో అద్భుతమైన విందు ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేకతగా మారింది. దసరా పండగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఏకంగా..101 రకాల పదార్థాలతో విందు ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోటకి చెందిన గుంత సహన, సురేష్ దంపతుల కుమార్తె సింధును గత నెలలో వరంగల్ కి చెందిన నిఖిత్ కు ఇచ్చి వివాహం జరిపించారు.
ఇది కూడా చదవండి:Ugly Story: నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ‘అగ్లీ స్టోరీ’ ఇంటెన్స్ టీజర్ విడుదల
పెళ్లయిన తర్వాత వచ్చిన మొదటి పండగ దసరా కావడంతో…ఇంటికి వచ్చిన అల్లుడు జీవితాంతం తాము చేసిన మర్యాదలను గుర్తు పెట్టుకోవాలనుకున్నారు. కొత్త అల్లుడికి పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల వారికి దీటుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వంద రకాల పిండి వంటలు, స్వీట్, అన్నంతోపాటు పలు రకాల పదార్థాలను తయారు చేసి భారీ అరిటాకులో వడ్డించి విందు ఏర్పాటు చేశారు. అత్తగారు వడ్డించిన విందును చూసి మొదట అల్లుడు ఆశ్చర్యానికి గురై..తేరుకొని భార్యతో కలిసి ఆరగించాడు. అత్తగారి కుటుంబం ఏర్పాటు చేసిన విందును జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని అల్లుడు నికిత్ చెప్పారు.