తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అదానీ ఫౌండేషన్ నుంచి తెలంగాణలో ఏర్పాటుకానున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం అందజేశారు. ఆయన స్వయంగా ఆ సొమ్మును సీఎం రేవంత్‌రెడ్డికి చెక్కు రూపంలో అందజేశారు.
