Bangladesh: బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం కోల్‌కతా, త్రిపుర నుండి తన ఇద్దరు దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది. డిసెంబర్ 2న అగర్తలాలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌లో విధ్వంసం జరిగింది. కోల్‌కతాలోని డిప్యూటీ హైకమిషన్ వెలుపల కూడా నిరసనలు జరిగాయి. ఈ సంఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం డిసెంబర్ 3న దౌత్యవేత్తలను రీకాల్ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
కోల్‌కతాలోని బంగ్లాదేశ్ తాత్కాలిక డిప్యూటీ హైకమిషనర్ మహ్మద్ అష్రాఫుర్ రెహమాన్ ఢాకా చేరుకున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ విదేశాంగ సలహాదారు తౌహీద్ హుస్సేన్‌ను కూడా కలిశారు. అగర్తలాలో జరిగిన దాడి గురించి, తాజా పరిస్థితుల గురించి అష్రాఫుర్ తౌహీద్‌కు తెలియజేశాడు. త్రిపుర బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ ఆరిఫ్ మహ్మద్ ప్రస్తుతం ఢాకాకు చేరుకోలేదు.
ఇది కూడా చదవండి: Fake Medical Degree: 70 వేలకే డాక్టర్ డిగ్రీ.. నకిలీ గుట్టు రట్టు
Bangladesh: మరోవైపు, అగర్తలా-కోల్‌కతా ఘటనకు ప్రతిస్పందనగా బంగ్లాదేశ్‌లో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి. గురువారం, బంగ్లాదేశ్ నాయకులు ఢాకాలో భారతీయ చీరలను తగులబెట్టడం ద్వారా భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.