పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. కరాచీ ఎయిర్‌పోర్టులో పేలుడు పదార్థాలు అమర్చిన ఓ ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.
రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులు అందరినీ అత్యవసర చికిత్స కోసం సమీపంలోని జిన్నా ఆసుపత్రికి తరలించారు. ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.