Category: News
-

సుప్రీం తీర్పుపై హోం మంత్రి అనిత ఏమన్నారంటే..?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. విజిలెన్స్ విచారణ అంటనే వైవీ సుబ్బారెడ్డికి వెన్నులో వణుకు వస్తుందని ఎద్దేవా చేశారు. తప్పు చేయని వారు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సంచలన…
-

నా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర లేఖ రాశారు. తన ఫామ్‌హౌస్‌కు అధికారులను పంపించాలని FTL, బఫర్ జోన్‌లో నిర్మాణాలు ఉంటే మార్క్ చేయాలని సూచించారు. తన సొంత ఖర్చులతో వాటిని కూల్చేస్తానని లేఖలో తెలిపారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు అవసరం లేదని చట్టాన్ని తన పని తాను చేసుకుపోనివ్వండని కేవీపీ సూచించారు.
-

KTR: సీఎం మాటలన్నీ డొల్లమాటలే
సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాటలన్నీ పచ్చి అబద్ధాలేనంటూ ఫైర్ అయ్యారు. వంద శాతం రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం మాటలన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయిందన్నారు. చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదని, ఇవ్వాల్సిన రైతుబందు సీజన్ ముగిసినా ఇవ్వలేదంటూ విమర్శించారు. అధికారిక లెక్కల ప్రకారం 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగితే.. అనాధికారికంగా ఇంకా ఎంతమంది అన్నదాతలు ఉన్నారో అని…






