CM Ramesh Mother: అనకాపల్లి పార్లమెంటు సభ్యులు (ఎంపీ) శ్రీ సీఎం రమేశ్ (CM Ramesh) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లిగారైన శ్రీమతి చింతకుంట రత్నమ్మ (83) బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రత్నమ్మ గారు, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (బుధవారం) ఉదయం 3:39 గంటలకు మరణించారు.
రత్నమ్మ గారి మృతితో సీఎం రమేశ్ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు ఎంపీ సీఎం రమేశ్‌కు ఫోన్ చేసి, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Cricket Tragedy: ఏంటి స్వామి ఇది.. స్టేడియంలో 9 మంది మృతి.. అయినా కొనసాగిన క్రికెట్ మ్యాచ్
కుటుంబ వివరాలు
రత్నమ్మ గారి భర్త శ్రీ చింతకుంట మునుస్వామి నాయుడు గారు. వారికి మొత్తం ఆరుగురు సంతానం. వారిలో కుమారులు: సీఎం సురేశ్, సీఎం రమేశ్, సీఎం ప్రకాశ్, సీఎం రాజు, మరియు కుమార్తెలు: గుమ్మళ్ల మాధవి, పాటూరు విజయలక్ష్మి ఉన్నారు.
అంత్యక్రియలు
చింతకుంట రత్నమ్మ గారి అంత్యక్రియలు రేపు గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె అంతిమ సంస్కారాలు కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం, పోట్లదుర్తి గ్రామంలోని స్వగృహంలో జరగనున్నాయి.

