Weekly Horoscope

Weekly Horoscope: రాశిఫలాలు: ఈ వారం ఏ రాశికి ఎలాంటి శుభయోగాలు?

Weekly Horoscope: ఈ వారం పలు రాశులకు ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహాల స్థితిగతులను బట్టి, ప్రతి రాశి వారు ఎలాంటి ఫలితాలు ఆశించవచ్చో, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలో తెలుసుకుందాం.

మేషం :
మేష రాశి వారు ఈ వారం ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా ఇది అత్యంత లాభదాయకమైన కాలం. ఉద్యోగ, వ్యాపారాల్లో ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయకుండా వెంటనే తీసుకోవడం మంచిది. మీ లక్ష్యంపై మరింత ఏకాగ్రత అవసరం. బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు ఆచితూచి మాట్లాడడం శ్రేయస్కరం. ప్రయాణాలు పెద్దగా ప్రయోజనకరం కాకపోవచ్చు, కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మిత్రుల సాయం అందుతుంది. మంచి ఫలితాల కోసం సూర్యుడిని ధ్యానించండి.

వృషభం :
వృషభ రాశి వారికి రాశ్యధిపతి శుక్రుడు సప్తమంలో, గురువు ధన స్థానంలో సంచారం చేయడం వల్ల శుభయోగాలు ఉన్నాయి. సంపన్న కుటుంబంలో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది, ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ, ఖర్చులు తగ్గించుకోవలసి ఉంటుంది. కుటుంబ విషయాల్లో బంధువులను తలదూర్చనివ్వకపోవడం మంచిది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మిథునం :
మిథున రాశి వారికి ఇది అత్యుత్తమ కాలం. ధన కారకుడైన గురువు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల ఫలితాలు శుభప్రదం. ఉద్యోగంలో మీ ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృథా ఖర్చులకు కళ్లెం వేయాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. గురు ధ్యాన శ్లోకాలను పఠించండి.

కర్కాటకం :
కర్కాటక రాశి వారికి శుక్ర, రవి, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా అనుకూలంగా మారుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. అయితే, కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు.

సింహం :
సింహ రాశి వారికి రాశ్యధిపతి రవి చతుర్థ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా పెరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి. సూర్యుడిని ఆరాధించండి.

కన్య :
కన్య రాశి వారికి కుజ, శుక్రులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది, పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. శని కార్యసిద్ధిని ప్రసాదిస్తాడు.

తుల :
తుల రాశి వారికి బుధ, శుక్ర, గురువుల అనుకూలత కారణంగా ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించి జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో విందులో పాల్గొంటారు. ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నవగ్రహ శ్లోకాలను చదువుకోండి.

వృశ్చికం :
వృశ్చిక రాశిలో రవి, శుక్రుల సంచారం కారణంగా ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు కొత్త బాధ్యతలను అప్పజెప్పే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అయితే, ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పరమశివుడిని ఆరాధించడం శుభప్రదం.

ధనుస్సు :
ధనుస్సు రాశి వారికి బుధ, రాహు, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి, ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఒకరిద్దరు బంధుమిత్రులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ధన నష్టానికి అవకాశం ఉంది. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. విష్ణువును పూజించండి.

మకరం :
మకర రాశి వారికి లాభ స్థానంలో రవి, కుజ, శుక్రుల సంచారం అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు ఏమాత్రం లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. మహాలక్ష్మిని పూజించండి.

కుంభం :
కుంభ రాశి వారికి మిథున రాశిలో గురువు ప్రవేశించడంతో ఆర్థిక బలం పెరుగుతుంది, మంచి అదృష్టం పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రతిష్ఠాత్మక కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. అయితే, ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం మంచిది. ఈశ్వరుడిని ఆరాధించండి.

మీనం :
మీన రాశి వారికి భాగ్యస్థానంలో మూడు గ్రహాలు కలవడం, దశమ స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల ఉద్యోగం జీవితం వైభవంగా సాగిపోతుంది. అధికారులు మీ పనితీరుతో బాగా సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగి, లాభాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఈశ్వరుడిని ఆరాధించండి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *