Horoscope

Horoscope: ఈ వారం మీ భవితవ్యం: ఆదాయ వృద్ధికి, వృత్తి పురోగతికి గ్రహాల అనుకూలత!

Horoscope: గ్రహాల స్థితిగతులను బట్టి ఈ వారం పన్నెండు రాశుల వారికి కలిగే ముఖ్యమైన ఫలితాలు, ఎదురయ్యే సవాళ్లు మరియు పాటించాల్సిన నియమాలు ఇక్కడ వివరిస్తున్నాము.

మేష రాశి :
ఈ వారం బుధ, శుక్రుల కలయిక వల్ల మీకు ఆదాయ వృద్ధికి లోటుండదు. ఆర్థికంగానే కాక, ఉద్యోగపరంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి, ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులు సులువుగా విజయం సాధిస్తారు. అయితే, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అనవసర వాదనలకు, శత్రువులకు దూరంగా ఉండాలి. మిత్రుల వల్ల కొద్దిగా ధనం నష్టపోయే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త. నవగ్రహ శ్లోకాలను పఠించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

వృషభ రాశి :
రవి, బుధుల అనుకూలతతో ఈ వారం సుఖప్రదంగా సాగుతుంది. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను తేలికగా అధిగమిస్తారు. కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు పెరిగే సూచన ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు పడతారు. చదువుల మీద మరింత శ్రద్ధ పెట్టాలి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉండవచ్చు. ప్రతికూల ఆలోచనల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. శివారాధన చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.

మిథున రాశి :
రాశ్యధిపతి బుధుడి అనుకూలత వల్ల మీరు చేపట్టిన ప్రతి ప్రయత్నం సఫలం అవుతుంది. ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వలన ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మరియు స్పెక్యులేషన్లు లాభిస్తాయి. కుటుంబంలో ఆనందకర సంఘటనలు మరియు శుభకార్యాలు జరుగుతాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు మనశ్శాంతిగా ఉండాలి. ఇష్ట దేవతారాధన శుభాలను ఇస్తుంది.

కర్కాటక రాశి :
ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో సహా అయిదు గ్రహాల అనుకూలత వలన అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం మంచి సూచకం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు వసూలవుతుంది. వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. మీ ప్రత్యర్థి ఓటమి పాలవుతారు. పని ప్రదేశంలో ఉత్సాహపూరితమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అయినప్పటికీ, విద్యార్థులు చదువుల మీద మరింత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల మీకు శుభం కలుగుతుంది.

సింహ రాశి :
రాశ్యధిపతి రవి అనుకూలత వల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలించి, ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధువుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. ఆర్థికంగా పొదుపు పాటించడం అవసరం. ప్రయాణాల వలన లాభాలు కలుగుతాయి. సూర్య ఆరాధన చేయడం శ్రేయస్కరం.

కన్యా రాశి :
రాశ్యధిపతి బుధుడి అనుకూలత వలన ఏ రంగంలో ఉన్నవారికైనా ఆశించిన పురోగతి ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు బాగా లాభిస్తాయి. సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అయితే, ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనిశ్చితి మనస్తత్వం లేకుండా, స్థిరమైన బుద్ధితో పనిచేసి ఖ్యాతి తగ్గకుండా చూసుకోవాలి. హనుమాన్ చాలీసా పారాయణంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

తులా రాశి :
గురు, బుధ, శనులతో పాటు, రాశ్యధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం శుభవార్తలు మరియు శుభ పరిణామాలతో గడిచిపోతుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి మంచి రోజు. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది అనుకూల సమయం. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కోర్టు సమస్యలు, ఆస్తి వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇష్టదేవతారాధన మీకు మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి :
రాశ్యధిపతి కుజుడి సంచారం, గురువు వీక్షణ వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి వారమంతా సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంది. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. తెలివి తేటలతో కఠిన పరిస్థితులను అధిగమిస్తారు. ప్రత్యేకించి వృత్తి నిపుణులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ కలహాలు, అర్థంలేని వాదనల నుంచి దూరంగా ఉండండి. ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. ఈశ్వరుని ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితములు ఉంటాయి.

ధనుస్సు రాశి :
రాశ్యధిపతి గురువు ఉచ్ఛపట్టడంతో పాటు శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులకు మీ మీద నమ్మకం వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలకు లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక లాభాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. వృథా ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. శ్రీమహాలక్ష్మీ ధ్యానం చేయడం శుభకరమైన ఫలితాలను ఇస్తుంది.

మకర రాశి :
గురు, శుక్ర, బుధులు అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారం ఉద్యోగపరంగానూ, ఆదాయపరంగానూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అకస్మిక ధనలాభం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలసివస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొందరు బంధుమిత్రులతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన ఉత్తమము.

కుంభ రాశి :
ఈ రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. గతకొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించి పెరుగుతుంది. రుణభారం నుంచి విముక్తి లభిస్తుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబంలో కొంత ఘర్షణ వాతావరణం ఉండవచ్చు, సహనంతో ఉండడం ద్వారా ప్రశాంతతను పొందవచ్చు. ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాట ఇవ్వకుండా ఉండడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వల్ల మేలు కలుగుతుంది.

మీన రాశి :
రాశ్యధిపతి గురువు ఉచ్ఛ పట్టడంతో పాటు, భాగ్య స్థానంలో గ్రహాల సంచారం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక, వృత్తిపరంగా లాభాలు, పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. కొద్ది ప్రయత్నంతో తల పెట్టిన పనులన్నిటినీ పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దృఢపడతాయి. వృత్తిపరంగా పొందిన విజయముల కారణంగా సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వినాయకుని ఆలయ సందర్శన వల్ల శుభం కలుగుతుంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *