Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ డల్లాస్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ కుటుంబానికి కొండంత బలం ఇచ్చిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీ ఇప్పుడు ‘స్పీడ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా’ మారిందని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉందని ఆయన అభివర్ణించారు. విడాకులు, మిస్ ఫైర్‌లు, క్రాస్ ఫైర్‌లు లేకుండా ఎన్డీయే కూటమి మరో 15 ఏళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Virat Kohli: విశాఖలో సింహాద్రి అప్పన్న దర్శించుకున్న విరాట్ కోహ్లి
“వారు ‘వై నాట్ 175’ అన్నారు, కానీ ప్రజలు మాత్రం ‘వై నాట్ 11’ అని సమాధానం ఇచ్చి, గత విధ్వంస పాలనకు ముగింపు పలికారు,” అని వైఎస్సార్సీపీపై పరోక్షంగా విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని, ‘రెడ్ బుక్’ తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరిస్తూనే, తాము ఎలాంటి కక్షసాధింపులకు పాల్పడటం లేదని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు.

