Waqf Act in Supreme Court: కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను జాబితా చేసి విచారించడంపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది.
జమియత్ ఉలేమా-ఇ-హింద్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును అత్యవసర విచారణకు డిమాండ్ చేశారు. దీనిపై సీజేఐ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ- మీరు న్యాయవాదులకు మెయిల్ లేదా లేఖ పంపమని చెప్పండి. దీనిపై సిబల్ మాట్లాడుతూ, ఈ ప్రక్రియ పూర్తయిందని అన్నారు.
వాస్తవానికి, సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ కోసం మౌఖికంగా ప్రస్తావించే విధానం అంటే మౌఖిక అప్పీల్‌ను రద్దు చేశారు. సిబ్బాల్ డిమాండ్ పై స్పందించిన CJI సంజీవ్ ఖన్నా మేము అన్ని లేఖలు, ఈ మెయిల్స్ చూస్తాము. వాటిని లిస్టింగ్ చేస్తాము. వీటిపై నిర్ణయం తీసుకుంటాము అని చెప్పారు.
Also Read: LPG Gas: పెరిగిన గ్యాస్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి.. తెలంగాణపై అదనపు భారం ఎంతో తెలుసా?
Waqf Act in Supreme Court: కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతకు వ్యతిరేకంగా జమియత్ ఉలేమా-ఎ-హింద్ కాకుండా 11 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. రాష్ట్ర యూనిట్లు కూడా హైకోర్టులో చట్టాన్ని సవాలు చేస్తాయని జమియత్ ఉలేమా-ఎ-హింద్ తెలిపింది.
కొత్త వక్ఫ్ చట్టంపై సోమవారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. నేషనల్ కాన్ఫరెన్స్ (NC) ఎమ్మెల్యే సభలో చట్టం కాపీని చింపేశారు. ఒక ఎన్‌సి ఎమ్మెల్యే తన జాకెట్‌ను చించి సభలో ఊపాడు. దీని తరువాత స్పీకర్ సభ కార్యకలాపాలను రోజంతా వాయిదా వేశారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం తీసుకురావడం గురించి ఎన్‌సితో సహా ఇతర పార్టీలు మాట్లాడాయి.

