Vijayanand: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే విజయానంద్‌ను నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ స్థానంలో విజయానంద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారులైన విజయానంద్, సాయిప్రసాద్ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలన్న మీమాంసతో ప్రభుత్వం తర్జనల భర్జనల అనంతరం విజయానంద్ వైపే మొగ్గు చూపింది. సాయిప్రసాద్‌ను నియమిస్తే ఆయన పదవీకాలం ముగియకముందే విజయానంద్ రిటైర్ కానున్నారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌కే అవకాశం దక్కింది. 2025 నవంబర్ నెల వరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో కొనసాగుతారు.
Vijayanand: 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కే విజయానంద్.. 1993లో ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ అసిస్టెంట్ కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత 1996లో రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. అదే ఏడాది నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ పీడీగా, తర్వాత రంగారెడ్డి జేసీగా కొనసాగారు. 1998 నుంచి 2007 వరకు శ్రీకాకుళం, నల్లగొండ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. 2008లో ప్లానింగ్, ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
Vijayanand: విజయానంద్ 2022 నుంచి ఏపీ జెన్‌కో చైర్మన్‌గా, 2023 నుంచి ఏపీ ట్రాన్స్‌కో కోచైర్మన్ అండ్ ఎండీగా, ఎనర్జీ డిపార్ట్‌మెంట్ స్పెషల్ సీఎస్‌గా పనిచేశారు. దీంతోపాటు ఎనర్జీ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా, ఏపీపీసీసీ, ఏపీఎస్పీసీఎల్, ఎన్ార్ీడీసీఏపీ, ఏపీఎస్ ఈసీఎం చైర్మన్‌గా ఇప్పటి వరకూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. దక్షిణ ప్రాంతీయ పవర్ కమిటీ చైర్మన్‌గా 2023-24 ఏడాదిలో వ్యవహరించారు. విద్యుత్ సంక్షోభాలను పరిష్కరించడంలో విజయానంద్ కీలక పాత్ర పోషించారు.