Vidaamuyarchi Teaser: పొంగల్ బరిలో అజిత్ సినిమా విడుదల కావడం ఖాయమైపోయింది. అయితే గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టు వస్తోంది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కాదు. ‘విడాముయర్చి’ సినిమా. నాలుగైదు రోజుల క్రితం చెన్నయ్ లో జరిగిన ‘పుష్ప-2’ ఈ వెంట్ లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నిర్మాతలు ఇంకా తమ చిత్రం షూటింగ్ ఏడు రోజులు బాలెన్స్ ఉందని చెప్పారు. దాంతో పొంగల్ బరిలోకి రావడం కష్టమే అని చెప్పారు. కానీ ఆ తర్వాత హైదరాబాద్ లో ‘రాబిన్ హుడ్’ ప్రెస్ మీట్ లో నిర్మాతల్లో ఒకరైనా రవిశంకర్… పొంగల్ కు అజిత్ మూవీని విడుదల చేసే ఆలోచన ఉందని, ఒకవేళ తమిళంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని రిలీజ్ చేస్తే… తప్పకుండా తెలుగులోనూ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని అన్నారు.
Vidaamuyarchi Teaser: దాంతో పొంగల్ మూవీస్ విషయంలో మరోసారి ఫిల్మ్ నగర్ లో చర్చ జరిగింది. అయితే తాజాగా పొంగల్ కు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కాకుండా ‘విడాముయర్చి’ రాబోతోంది. దీనిని మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని మేకర్స్ తెలిపారు. త్రిష, అర్జున్, ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.