సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసిపికి వర్ష సాగులు తగులుతున్నాయి. వారానికి కీలక నేత రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు కియాశీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు రాజీనామాలు చేస్తున్నడంతో క్యాడర్లో గుబులు మొదలైంది.
ఖాజాగా వైసీపీకి మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పద్మ పద్మకు నిరాశ ఎదురయింది. హై కమాండ్ ఆమె వైపు చూడకపోవడంతో సైలెంట్ అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆమె ఫ్యాన్ కు దూరంగా ఉంటున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ కు పంపించారు.
గుడ్ బుక్ పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తల కోసం గుడ్ బుక్ కాదు..గుండె బుక్ కావాలి..జగన్‌వి అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణి సమాజం పట్ల, పాలనలో..పార్టీని నడపడంలో జగన్ బాధ్యతగాలేరు. అని రాజీనామా లేఖలో తెలిపారు వాసిరెడ్డి పద్మ
.

