DOGE: అమెరికా ప్రభుత్వం ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (DOGE) విభాగాన్ని మూసివేసినట్లు ప్రకటించింది. అధ్యక్షుడిగా రెండోసారి పదవిలోకి వచ్చిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఈ శాఖను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, శాఖల పనితీరులో సమూల మార్పులు తీసుకురావడం లక్ష్యంగా DOGEను ప్రారంభించారు. అయితే ఈ విభాగం కోసం నిర్ణయించిన గడువు 2026 జూలై 4 అయినప్పటికీ, దానికి ఎనిమిది నెలల ముందుగానే మూసివేయడం అమెరికా పాలనా వర్గం నిర్ణయించింది.
ట్రంప్ మొదట ప్రకటించిన ప్రకారం, అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం జరిగే సమయానికి ఫెడరల్ బ్రూరోక్రసీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు భాగంగా DOGE పనిచేస్తుందని పేర్కొన్నారు. శాఖ ఏర్పాటైన తరువాత వేలాది మంది ఉద్యోగులను తొలగించడం వంటి విస్తృత చర్యలు చేపట్టబడ్డాయి.
Also Read: Bangladesh: షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ లేఖ!
DOGE విభాగానికి ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి సంయుక్త సారథులుగా నియమించబడ్డారు. అయితే రామస్వామి కొంతకాలానికే తన పదవి నుంచి వైదొలిగారు. అనంతరం మస్క్‌పై విమర్శలు పెరిగాయి. ట్రంప్ పాలనా వ్యవస్థను ఆయన వెనకుండి నడిపిస్తున్నారన్న ఆరోపణలు వెలువడ్డాయి. దీనిపై వైట్‌హౌస్ స్పందిస్తూ, మస్క్ DOGE ఉద్యోగి కాదని, ట్రంప్‌కు సలహాదారుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నారని స్పష్టంచేసింది.
అనవసర ఖర్చులను తగ్గించే ప్రధాన లక్ష్యాలు పూర్తి అయ్యాయని ప్రభుత్వం భావించడం, అంతర్గత చర్చలు ముగిసినట్లయితే DOGE శాఖను ముందుగానే రద్దు చేయడానికి ఇదే కారణమని అధికారులు చెబుతున్నారు.

