Wedding Cancel Food Delay: భోజనం ఆలస్యంగా వడ్డించారని పెళ్లికొడుకు, అతని కుటుంబ సభ్యులు పెళ్లి మండపం నుంచి కోపంతో వెళ్ళిపోయి. తరువాత సోదరుడి బంధువుని పెళ్లి చేసుకున్న వరుడు.. విషయం తెలిసిన వధువు నయం కోసం పోలీసులని ఆశ్రయించింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లోని చందౌలీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని చందౌలి పట్టానికి దగరలో ఉన్న హమీద్ పూర్ గ్రామంలో చెందిన జరీనా అనే యువతితో చందౌలి పట్టణానికి చెందిన మెహ్తాబ్ అనే యువకుడితో ఏడు నెలల క్రితమే వివాహం నిశ్చయించారు.
డిసెంబర్ 22న, వివాహ ఊరేగింపుతో హమీద్‌పూర్ గ్రామంలో ఉన్న వధువు ఇంటికి పెళ్ళికొడుకు. అతని బంధువులు చేరుకున్నారు. వచ్చిన వారిని ఘనంగా స్వాగతం పలికారు ఆధాపర్చు వారు. ముందుగానే అనుకున్న విధంగానే పెళ్ళికొడుకు కుటుంబానికి 1.5 లక్షలు ఇచ్చారు. భోజనాల సమయం కావడంతో అందరూ తిన్నారు. కానీ కొంతమంది మిగిలిపోయారు దింతో వెంటనే పెళ్లికూతురు త్రండ్రి వంటలు మొదలు పెట్టారు. సమయం పట్టడంతో పెళ్లి కొడుకుని అతని స్నేహితులు ఎద్దెవా చేశారు. అవి విన్న పెళ్లికొడుకు తమకి అవమానం జరిగింది అని గడవ పడదు. దింతో పెళ్లికూతురు బంధువులు కూడా వాగ్వాదానికి దిగారు.
ఇది కూడా చదవండి: Viral Video: వరుడిపై దాడి చేసిన మాజీ ప్రియురాలు.. వీడియో చుస్తే అందరు షాక్ అవ్వాల్సిందే
దింతో అక్కడ తొక్కిసలాట జరిగింది. గొడవ పెద్దది కావడంతో పెళ్లికొడుకు స్నేహితులు పెళ్లికుతారు త్రండ్రిని కొట్టారు. గ్రామ పెద్దలు కలుగజేసుకొని శాంతింప చేసినా..పెళ్లి రద్దు చేసుకొని వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి పెళ్ళికొడుకు వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు.
మెహతాబ్(పెళ్లికొడుకు0 పెళ్లి విషయం తెలుసుకున్న వధువు, ఆమె తల్లిదండ్రులు డిసెంబర్ 23న ఇండస్ట్రియల్ నగర్ ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెళ్లి కోసం ఖర్చు పెట్టిన రూ.7 లక్షలు, పెళ్లికి ముందు ఇచ్చిన రూ.1.5 లక్ష డబ్బు తిరిగి ఇప్పించాలని కేసు పెట్టింది.
24 గంటలు గడిచిన పోలీసులు ఏమీ చేయకపోవడంతో తర్వాత పోలీసు సూపరింటెండెంట్ ఆదిత్య లగేను సంప్రదించారు. విషయం తెలుసుకున్న ఎస్ పి ఆదిత్య లాఘే ఇరు కుటుంబాలని పిలిచి రాజి కుదిర్చాడు. మహిళ కుటుంబానికి రూ.1.61 లక్షలు చెల్లించేందుకు ఇరువర్గాలు లిఖితపూర్వక ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సర్కిల్ అధికారి రాజేష్ రాయ్ తెలిపారు.