United States: అమెరికా దేశంలో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అక్కడ ఉపాధి కోసం వెళ్లిన ఎందరో ఇండియన్లు.. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఇటీవల వరుస మరణాలతో ఆందోళన నెలకొన్నది. రోడ్డు ప్రమాదాల్లో కొందరు, కాల్పుల్లో మరికొందరు, లోయల్లో పడి ఇంకొందరు.. ఇలా పలువురు మృత్యువాత పడుతున్నారు. తాజాగా దుండగుల కాల్పుల్లో మరో తెలుగు విద్యార్థి చనిపోయిన ఘటన నెలకొన్నది.
United States: అమెరికాలోని చికాగో నగరం సమీపంలో దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ (26) చనిపోయాడు. సాయితేజ అక్కడ ఎంఎస్ చదువు కోసం నాలుగు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. సాయితేజ మరణ వార్తతో ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో విషాదం అలుముకున్నది. ఈ ఘటనతో అమెరికాలో చదువుకునే పిల్లలున్న తెలుగు కుటుంబాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి.