AUS vs IND: బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో ఆసీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. పెర్త్ టెస్టు పరాజయంతో ఒత్తిడిలో పడిన కంగారు జట్టుకు రెండో టెస్టు ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ జట్టులో కీలక పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా అడిలైడ్ వేదికగా నిర్వహించే పింక్‌బాల్ డే/నైట్ టెస్టుకు దూరం కానున్నాడు. రెండో టెస్టు అనంతరం అతను కోలుకోకపోతే సిరీస్ నుంచి దూరమయ్యే ప్రమాదం ఉండడంతో ఈ సిరీస్ లో కంగారూ జట్టుకు పెద్ద దెబ్బగా మారనుంది.
AUS vs IND: మూలిగే నక్కపై తాటి పండు పడినట్లుగా తొలిటెస్టు పరాజయం అనంతరం కంగారూ జట్టుకు మరో కష్టం ఎదురైంది. పెర్త్ టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన హేజిల్ వుడ్ గాయం కారణంగా రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. నడుము కింది భాగంలో నొప్పి వచ్చినట్లు మేనేజ్‌మెంట్ దృష్టికి హేజిల్‌వుడ్ తీసుకురావడంతో అతడిని వైద్యులు పరీక్షించారు. విశ్రాంతి అవసరమని సూచించినట్లడంతో అతన్ని రెండో టెస్టుకు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.దీంతో డిసెంబర్ 6న జరగనున్న పింక్ బాల్ టెస్టులో హేజిల్ వుడ్ ఆడకపోవవడం దాదాపు ఖాయంగా మారింది.
ఇది కూడా చదవండి: IPL Mega Auction 2025: ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ప్లేయర్లు వీరే
AUS vs IND: అంతేకాదు అతని పరిస్థితి మెరుగుకాకపోతే సిరీస్‌కే దూరమయ్యే అవకాశం లేకపోలేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, గాయంతో ఉన్న హేజిల్ వుడ్ .. ఆస్ట్రేలియా స్క్వాడ్‌తోపాటు ఉంటాడని.. రికవరీ అయ్యేవరకూ వైద్య బృందం పర్యవేక్షిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. పెర్త్ టెస్టులో ఐదు వికెట్లు తీసిన హేజిల్‌వుడ్ మిగతా ఆసీస్ బౌలర్ల కంటే ఉత్తమ ప్రదర్శన చేశాడు.జోష్ హేజిల్‌వుడ్ గైర్హాజరీతో కొత్తగా ఇద్దరికి స్క్వాడ్‌లో చోటు దక్కింది. సీన్ అబాట్, డొగ్గెట్‌ను అతనికి ప్రత్యామ్నాయంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ప్రైమ్‌మినిస్టర్స్ XI జట్టులో ఉన్న బోలాండ్ కూడా ఆసీస్ స్క్వాడ్‌లో ఉన్నాడు. అతడు ఈ వార్మప్ మ్యాచ్‌లో రాణిస్తే అతడు భారత్‌తో రెండో టెస్టు తుది జట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
2 Replies to “AUS vs IND: పింక్ బాల్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు షాక్.. ఆ బౌలర్ ఔట్!”