సత్యా రెడ్డి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం ‘ఉప్పు సత్యాగ్రహం’. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఈ సంఘటన ప్రజలందరికీ తెలిసేలా చేయాలనే ఉద్దేశంతో రూపొందిన ఈ చిత్రంలో గద్దర్, పల్సర్ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మ శ్రీ, ఎంవివి సత్యనారాయణ, ప్రసన్న కుమార్, వెన్నెల తదితరులు నటించారు. గద్దర్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా కాగా. శ్రీ కోటి సంగీతం అందించారు. మరి ఈ రోజే విడుదలైన ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరించిందో ఈ సమీక్ష లో తెలుసుకుందాం.
Ukku Satyagraham: కథ: ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎంత పెద్ద చర్చనీయంశం అయ్యిందో అందరికి తెలిసిందే. కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు తమ స్వార్థం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆపేందుకు నాయకులు, ఉద్యమకారులు తీవ్రంగా పోరాడారు. ఈ సంఘటనలను ఆధారంగా తీసుకొని, సత్యా రెడ్డి ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని రూపొందించారు. వైజాగ్‌లో జరిగిన ఆందోళనలు, ఉద్యమకారుల పాత్ర, మల్టీ నేషనల్ కంపెనీల ప్రైవేటీకరణ యత్నాలు, గద్దర్ గారి పాత్రతో పాటు ఆయన చేసిన కృషి ఈ కథలో ప్రధానాంశాలుగా ఉంటాయి. ప్రజా ఉద్యమం, విప్లవ చైతన్యాన్ని సమాజానికి తెలియజేసే ప్రయత్నంగా ఈ చిత్రం రూపొందినది. చివరికి ఈ ఉద్యమం ఎలా ముగిసింది, ఎవరి ప్రయత్నం ఫలించింది అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని తప్పక చూడాల్సిందే.
విశ్లేషణ: ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన సత్యా రెడ్డి నటన హైలైట్‌గా నిలిచారు. తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి, ప్రేక్షకుడిని తన హావభావాలతో ఆకర్షించారు. ఆయన నటన దాసరి నారాయణరావు గారిని గుర్తు చేసేలా ఉండడం ప్రత్యేకం. ఒక ఉద్యమకారుడిగా తన పాత్రకు జీవం పోయడమే కాకుండా, ఈ పాత్ర నిజమైన ఉద్యమకారుడు ఇలానే ఉంటాడు అనే భావనను తీసుకొచ్చారు. ఎక్స్ప్రెషన్లలోనూ, డైలాగ్ డెలివరీలోనూ ఆయన మరొక స్థాయి ప్రదర్శన కనబరిచారు. ప్రజానౌక గద్దర్ ఈ చిత్రానికి కీలక బలం గా నిలిచారు. సత్యా రెడ్డితో కలిసి ఆయన నటిస్తూ, ఉద్యమ సన్నివేశాల్లో చిత్రానికి మరింత బలం చేకూర్చారు. గద్దర్ ఎనర్జీ గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమా లో ఆయనా ఎనర్జీ తో సినిమా రేంజ్ నే మార్చారు. తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ, గద్దర్ పాత్ర ఎంత కీలకమో, చిత్రానికి ఎలాంటి బలం చేకూర్చిందో స్పష్టంగా కనిపిస్తుంది. గద్దర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, రాసిన విప్లవాత్మక పాటలు సినిమాకు బోనస్‌గా మారాయి.
Ukku Satyagraham: ఆ పాటలు ప్రేక్షకులను ప్రభావితం చేస్తూ, గద్దర్ పాత్రకు మరింత ప్రముఖతను తెచ్చిపెట్టాయి. పల్సర్ ఝాన్సీ తన పోలీస్ ఆఫీసర్ మరియు ఉద్యమకారునిగా ఉన్న పాత్రకు న్యాయం చేశారు. ఇతర పాత్రధారులందరూ తమ పాత్రలతో సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమా కు స్క్రీన్ ప్లే ఎంతో ముఖ్యం. దాన్ని చక్కగా రాశారు దర్శకుడు. సత్యారెడ్డి దర్శకత్వం, స్క్రీన్ ప్లే బాగా ఆకట్టుకున్నాయి. విశాఖపట్నంలోని నేచురల్ లొకేషన్లలో చిత్రీకరించడం వల్ల సినిమాకు ఒరిజినాలిటీ వచ్చింది. విప్లవాత్మక డైలాగులు సినిమా బలంగా నిలిచాయి. ముఖ్యంగా గద్దర్ గారి సీన్స్ ఎంతో బలంగా రాసుకున్నారు, డబ్బింగ్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించింది. కెమెరా పనితనం బాగుంది, ఇది చిత్రానికి ప్రత్యేకతను ఇచ్చింది. సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా కు తగ్గట్లు ఉన్నాయి.
తీర్పు: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమయంలో జరిగిన పోరాటాలను యదార్థంగా చూపించిన ఈ చిత్రం గద్దర్ గారి విప్లవాత్మక స్ఫూర్తిని ఆవిష్కరించి నేటి ప్రేక్షకులకు మేటి అనుభవాన్ని ఇస్తుంది.
రేటింగ్ : 3.5/5
నటీనటులు: గద్దర్ గారు, సత్యా రెడ్డి, ‘పల్సర్ బైక్’ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, ఎం వి వి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల తదితరులు
సంగీతం : శ్రీకోటి
ఎడిటర్ : మేనగ శ్రీను
ప్రొడక్షన్ : జనం ఎంటర్టైన్మెంట్స్
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత మరియు దర్శకత్వం : పి. సత్యా రెడ్డి
పి ఆర్ ఓ : మధు వృధా
విడుదల తేదీ: 29 నవంబర్ 2024