Hyderabad: సైబరాబాద్ పోలీసులు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కొన్ని ప్రత్యేక ఆంక్షలు విధించారు. రేపు డిసెంబర్ 31 రాత్రి, ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ కారిడార్‌లోని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు.డిసెంబర్ 31 రాత్రి 10:00 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5:00 గంటల వరకు ఫ్లైఓవర్లు అందుబాటులో ఉండవు.
భారీ వాహనాలు మరియు ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.ఈ పరిధిలో ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు.
ట్రాఫిక్ పోలీసులు రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారు. నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.పబ్‌లు, బార్ల యజమానులు ప్రైవేట్ వాహనాలు లేదా డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.
డిసెంబర్ 31 రాత్రి ఉచిత ప్రయాణ సేవలు అందించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ సంఘం ప్రకటించింది. 500 కార్లు, 250 క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.
నూతన సంవత్సరాది సందర్భంగా మెట్రో రైళ్ల సేవలను అర్థరాత్రి 12:30 గంటల వరకు పొడిగించారు. చివరి మెట్రో ప్రయాణం ప్రతి కారిడార్‌లో చివరి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
న్యూఇయర్ వేడుకలను సురక్షితంగా, సజావుగా జరుపుకోవడానికి పోలీసులు ఈ చర్యలను చేపట్టారు. ప్రజలు సహకరించి, నియమాలను పాటించాలని సూచించారు.