Tirumala:తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆన్‌లైన్‌లో నిర్వహించిన రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఈసారి భక్తులు భారీగా స్పందించడంతో మూడో రోజునే రికార్డు స్థాయిలో నమోదు జరిగింది. ఒక్క మూడో రోజు మాత్రమే 9.95 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తం మూడు రోజుల పాటు జరిగిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లలో కలిపి 24 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ విధానంలో దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. లాటరీ పద్ధతిలో ఎంపికైన భక్తులకు మాత్రమే ఈ టోకెన్లు అందుబాటులోకి వస్తాయి. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో టోకెన్లు పొందిన వారినే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టంచేసింది.
భక్తులు తమకు టోకెన్ వచ్చినదేమో తెలుసుకోవడానికి ఈ-డిప్ ఫలితాలను ఆన్లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. భారీగా రిజిస్ట్రేషన్లు జరిగిన నేపథ్యంలో, దర్శన ఏర్పాట్లను కూడా టీటీడీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది.
—

