Bandi Sanjay: కరీంనగర్‌లో బీజేపీ నాయకుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలకు చోటు లేదని, అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలే చివరివని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. తమ సొంత ఆలోచనలను పార్టీ పెద్దలపై రుద్దే ప్రయత్నం చేయబోమని కూడా ఆయన తెలిపారు.
“పదవుల కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు” అని బండి సంజయ్ అన్నారు. మంత్రి పదవి తనకు వద్దని అధిష్ఠానానికి తాను చెప్పలేదని, పార్టీ హైకమాండ్ ఎలాంటి బాధ్యత అప్పగించినా దాన్ని పూర్తి బాధ్యతగా నిర్వహిస్తానని ఆయన మరోసారి చెప్పారు. పార్టీ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని, వాటిని గౌరవిస్తామని బండి సంజయ్ తేల్చి చెప్పారు.

