texas the little india fair

The Little Inda Fair: వీకెండ్ లో ఎంజాయ్ చేయాలంటే.. టెక్సాస్ లోని ది లిటిల్ ఇండియా ఫెయిర్ లోకి వెళ్లాల్సిందే!

The Little Inda Fair: హాయ్.. ఈ వీకెండ్.. ఎక్కడికి వెళదాం.. ఏం చేద్దాం.. ఫ్యామిలీతో కలిసి సరదాగా కొద్దిసేపు కాలక్షేపం చేయాలంటే మంచి ప్లేస్ ఏముంది అని వెతుకుతున్నారా? అయితే, మీ వెతుకులాటకు పుల్ స్టాప్ పెట్టేయండి. ఎందుకంటే, మీకోసం మంచి వినోదాన్ని.. మంచి ఫుడ్ ని అందించడానికి ఉమ్మిడి గోల్డ్ జ్యుయలర్స్ అలాగే ఎమినెన్స్ రియాలిటీ ఉల్లాసవంతమైన వేదిక ఏర్పాటు చేశాయి.

The Little Inda Fair: ది లిటిల్ ఇండియా ఫెయిర్ పేరుతో ఈ శనివారం అంటే ఏప్రిల్ 19న టెక్సాస్ లోని గ్రాండ్‌స్కేప్, ది కాలనీలో కుటుంబం అంతా ఎంజాయ్ చేసేలా ప్రత్యేక వినోదాల వల్లరి అందుబాటులో ఉంటుంది. ఈ ఫెయిర్  లో 55 వెండార్ స్టాల్స్ తో పాటు పది కంటే ఎక్కువ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఫెయిర్ లోకి ఎంట్రీ పూర్తిగా ఉచితం. రకరకాల బిర్యానీలు.. బోబా.. హలీమ్ ఇలా మీరు కోరుకునే ఎన్నోరకాల రుచులు మీకోసం ఇక్కడ సిద్ధంగా ఉంటాయి. మీ నోరూరించే ఫుడ్.. మీ మనసుకు నచ్చే వస్తువులు ఒకే దగ్గర మీకోసం ఏర్పాటు అవుతున్నాయి. సరదాగా షాపింగ్ చేస్తూ మంచి ఫుడ్ ఆస్వాదిస్తూ వీకెండ్ ఎంజాయ్ చేయవచ్చు. 

The Little Inda Fair: అంతేకాదండోయ్.. కొవ్వొత్తుల తయారీ, పెయింటింగ్, మెహెందీ వంటి బోలెడు సరదా ఆటలతో పాటు పిల్లల కోసం సరదా వర్క్‌షాప్‌లు కూడా ఇక్కడ మీ పిల్లలకు ఉత్సాహాన్నిస్తాయి. తంబోలా, లెమన్ అండ్ స్పూన్,  టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలతో మీ బాల్యాన్ని తిరిగి గడపడానికి మీరు సిద్ధంగా ఉండండి! వీటన్నిటి తో పాటు.. లైవ్ డ్యాన్స్ ప్రదర్శనలు, డీజే అండ్ మ్యూజిక్, ఫోటో బూత్‌ లు ఒక్కటేమిటి ఎన్నో సరదాలు ఒక్కచోటే మీకు మజా ఇస్తాయి. 

అన్నట్టు మర్చిపోకుండా వుమ్మిడి బంగారు జ్యువెలర్స్ రాఫెల్ డ్రాలలో ప్రతి గంటకు ఇచ్చే వెండి నాణేలను పోగేసుకోండి. ఈ శనివారం ది లిటిల్ ఇండియా ఫెయిర్ లో మీ కుటుంబంతో ఉల్లాసంగా గడపడంతో పాటు మీ అదృష్టాన్ని కూడా వెండి నాణెం రూపంలో మీ జేబులో వేసుకోండి. 

ఈ శనివారం ఇక్కడకు రావడం సంస్కృతి, ఆహారం, సంగీతం, కుటుంబ వినోదంతో నిండిన రోజుగా మీ మనసులో కచ్చితంగా నిలిచిపోతుంది.  కాబట్టి దీన్ని మిస్ అవ్వకండి! పూర్తి వివరాలు కింద ఉన్న ఇమేజ్ లో ఉన్నాయి . . 

ది లిటిల్ ఇండియా ఫెయిర్‌లో కలుద్దాం!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *