The Family Man

The Family Man: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3 వస్తోంది!

The Family Man: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరీస్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. తొలి సీజన్ తో పాటు సెకండ్ సీజన్ కూడా విజయవంతమైన నేపథ్యంలో మూడో సీజన్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మూడో సీజన్ కి సంబంధించిన షూటింగ్ పై లీడ్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ అప్ డేట్ ఇచ్చేశాడు. ఈ సీరీస్ కి సంబంధించి తన పాత్ర చిత్రీకరణ పూర్తయినట్లు తెలియచేశాడు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ పోస్ట్ పెడుతూ ‘సక్సెస్ ఫుల్ గా మూడో సీజన్ షూట్ కంప్లీట్ అయింది.

The Family Man: సరికొత్తగా ఫ్యామిలీ మేన్ మీ ముందుకు రాబోతున్నాడు’ అని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ లో దేశభక్తి పరుడైన స్పై ఏజెంట్ శ్రీకాంత్ తివారిగా మనోజ్ బాజ్ పాయ్ నటించగా, ప్రియమణి, షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరి, వేదాంత్ సిన్హా ఇతర కీలక పాత్రలను పోషించారు. మరి తొలి రెండు సీజన్స్ లాగే ఈ మూడో సీజన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిద్దాం..

‘బాపు’ ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన రానా

Rana Daggubati: బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించిన ‘బాపు’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రానా ఆవిష్కరించారు. డార్క్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై రాజు, భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దయ రచన, దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. నిజజీవిత సంఘటనల స్ఫూర్తితో వ్యవసాయ కుటుంబానికి చెందిన కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి, అవసరాల శ్రీనివాస్ ఇందులో ముఖ్య పాత్రధారులు. ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేస్తామంటున్నారు దర్శకనిర్మాతలు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *