Avatar: జేమ్స్ కామెరూన్ రూపొందించిన అవతార్ సిరీస్‌లో మూడో భాగం ‘ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్ విడుదలైంది. డిసెంబర్ 19న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం కొత్త యాష్ పీపుల్ తెగను పరిచయం చేస్తోంది. జేక్ సుల్లీ కుటుంబం, మెట్కాయినా తెగతో కలిసి చెడు శక్తులతో పోరాడుతుంది. ట్రైలర్ కొత్త పాత్రలు, భావోద్వేగ క్షణాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Also Read: Shruti Haasan: శ్రుతి హాసన్ కలల పాత్ర ఏమిటో తెలుసా?
అవతార్ సిరీస్‌లో మూడో అద్భుతం ‘ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తోంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ని గమనిస్తే.. పాండోరా ప్రపంచంలో కొత్త యాష్ పీపుల్ తెగను చూపిస్తుంది. హీరో జేక్ సుల్లీ, అతని కుటుంబం మెట్కాయినాతో కలిసి యాష్ పీపుల్ నాయకురాలు వరాంగ్తో పోరాడుతారు. అగ్ని శక్తిని నియంత్రించే వరాంగ్, పాండోరా అడవులను బూడిద చేస్తుంది. సామ్ వర్థింగ్టన్, జో సల్దానా, ఓనా చాప్లిన్, మిచెల్ యో వంటి తారలతో ఈ సినిమా దృశ్య విందుగా, భావోద్వేగ ప్రయాణంగా నిలవనుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. మరి సినిమా విడుదల అయ్యాక ఎలాంటి ఇండస్ట్రీ రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.

