Pakistan: పాకిస్తాన్ వాయువ్య నగరమైన పెషావర్‌లో సోమవారంఉదయం పారామిలిటరీ దళం ప్రధాన కార్యాలయంపై సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు కమాండోలు మరణించారు. ఉగ్రవాదులు తుపాకులతో దాడి చేయడంతో పాటు, ఈ కాంప్లెక్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది (కమాండోలు) ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Crime News: నాకే మొబైల్ కొన్నివారా.. 13 ఏళ్ల బాలిక చేసిన పనికి తల్లిదండ్రులు షాక్
మొదటి ఆత్మాహుతి బాంబర్ కాన్‌స్టాబ్యులరీ ప్రధాన ద్వారం వద్ద దాడి చేయగా, రెండవ బాంబర్ కాంపౌండ్‌లోకి ప్రవేశించి పేలుడుకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సైన్యం, పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. హెడ్‌క్వార్టర్స్ లోపల ఇంకా కొంతమంది ఉగ్రవాదులు ఉండవచ్చనే అనుమానంతో అధికారులు పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించనప్పటికీ, ఇటీవల ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సులలో హింసాత్మక చర్యలు మళ్లీ పెరిగాయి.

