Telangana Police:మందుబాబులకు ఇదో హెచ్చరిక. న్యూ ఇయర్ వేళ.. అంబరాన్నంటే సంబురాల్లో మునిగి తేలుదామనుకుంటున్న వారికీ గుండెల్లో గుబులు పుట్టించే వార్త. అర్ధరాత్రి దాటాక కూడా ఎంచక్కా తాగి వాహనాలు తోలుకుంటూ ఇండ్లకొచ్చాద్దామనుకునే వారికి ముందే భారమైన మాట ఇది. అందుకే నూతన సంవత్సరారంభాన మందు తాగాలనుకునే వారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట.
Telangana Police:డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానా విధించడంతోపాటు జైలు శిక్షను కూడా అనుభవించాల్సి వస్తుంది అని ట్రాఫిక్ పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇవ్వాళ రాత్రి అంటే డిసెంబర్ 31న మంగళవారం 8 గంటల నుంచి రేపు అంటే జనవరి 1న ఉదయం 7 గంటల వరకు తెలంగాణ పోలీసులు డ్రంకన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు చేయనున్నారు.
Telangana Police:మద్యం తాగి మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, ఆరు నెలలపాటు జైలు శిక్ష ఉంటేందని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండోసారి పట్టుబడిన వారికి అదనపు ఫైన్, శిక్షలు ఉంటాయట. అలాంటి వారికి రూ.15 వేలు, జైలు శిక్షతోపాటు 3 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తారు. డ్రగ్స్ సేవించి దొరికితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు.