Telangana News: కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామ పరిధిలోని తండాలో అదే పార్టీ నేతలకు పరాభవం ఎదురైంది. అధికారులకూ తీవ్ర నిరసన వ్యక్తమైంది. పోలీసులు ఎంత వారించినా ఆ తండావాసులు వినకుండా తమ నిరసనను కొనసాగించగా, కాంగ్రెస్ నాయకులు వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది.
Telangana News: ఎమ్మెల్యే సొంత గ్రామమైన అమీనాబాద్ నుంచి పతినాయక్ తండాను గతంలో బీఆర్ఎస్ హయాంలోనే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం మళ్లీ అదే తండాను అమీనాబాద్‌లో విలీనం చేసేందుకు ఎమ్మెల్యే అనుచరులైన కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీనిని ఆ తండావాసులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
Telangana News: ఈ దశలో మంగళవారం తండాను పాత గ్రామ పంచాయతీలో విలీనం చేయడానికి గ్రామ సభ ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు తండాకు రాగానే స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమ తండాను ఎట్టి పరిస్థితుల్లో అమీనాబాద్ గ్రామంలో కలపొద్దని డిమాండ్ చేస్తూ ఏకంగా తిరగబడ్డారు. ఈ సందర్భంగా తండావాసులు అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.