Telangana:

Telangana: స‌చివాల‌యం ఎంట్రీకి మ‌నోడు భ‌లే ప్లాన్ వేసిండు!

Telangana: డాక్ట‌ర్ బీఆర్‌ అంబేద్క‌ర్ తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంగా ఆధునిక హంగుల‌తో రూపుదిద్దుకొన్నా అప్పుడ‌ప్పుడూ భ‌ద్ర‌తా లోపం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది. రాష్ట్రానికే పాల‌నా కేంద్రంగా కొన‌సాగుతున్న ఈ కార్యాల‌యంలోకి ప్ర‌వేశానికి అంద‌రికీ ఉండ‌దు. అనుమ‌తితోనే లోనికి ప్ర‌వేశం క‌ల్పిస్తారు. మీడియాకు కూడా ప‌రిమిత అనుమ‌తే ఉంటుంది. అలాంటిది ఓ వ్య‌క్తి ఏకంగా కార్యాల‌యంలో క‌లియ‌దిర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది.

Telangana: అనుమ‌తి విష‌యంలో ఉన్న నిబంధ‌న‌ల‌ను ఆస‌రా చేసుకున్న ఆ వ్య‌క్తి ఓ ఫేక్ ఐడీని సంపాదించాడు. అది అలాంటిలాంటి శాఖ ఐడీ కాదు. ఏకంగా రెవెన్యూ శాఖ ఉద్యోగిగా ఓ ఐడీని చేయించేశాడు. రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్‌గా చెప్పుకుంటూ కార్యాల‌యంలో తిర‌గ‌సాగాడు. అస‌లైన ఉద్యోగి ఐడీని పోలిన ఫేక్ ఐడీని ఫొటోతో స‌హా సృష్టించాడు.

Telangana: వెంట‌నే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. అస‌లు ఆ న‌కిలీ ఐడీ ఎలా సంపాదించాడు? ఎవ‌రు స‌హ‌క‌రించార‌న్న విష‌యాల‌పైనా ఆరా తీశారు. నిందితుడు భాస్క‌ర్‌రావుకు స‌హ‌కరించిన ఓ డ్రైవ‌ర్ ర‌విని కూడా అదుపులోకి తీసుకొని ఇద్ద‌రిపైనా కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిసింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *