Tamil nadu: తమిళనాడులో మరో దారుణం వెలుగు చూసింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణంలోని ఓ ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థిని ప్రసవించిన ఘటన చోటుచేసుకున్నది. ఆమెకు గర్భం ఎవరి వల్ల వచ్చిందో? ఏమైందో? ఇంకా వివరాలు తెలియరాలేదు. కానీ, 9 నెలల తర్వాత ఆమెకు పురిటి నొప్పులు వచ్చి బిడ్డను ప్రసవించింది.
Tamil nadu: ఆ విద్యార్థిని తరగతి గదిలోనే ఉండగా, ప్రసవ నొప్పులు వచ్చాయి. వెంటనే కళాశాల మరుగుదొడ్డిలోకి వెళ్లింది. పంటిబిగువున బాధను భరిస్తూ ఆడబిడ్డను ప్రసవించింది. యూట్యూబ్ వీడియోను చూసి బొడ్డును కోసింది. ఆ తర్వాత బిడ్డను కళాశాలలోని ఓ చెత్తకుండీలో పడేసి చెత్తతో కప్పేసింది.
Tamil nadu: ఆ తర్వాత ఏమీ జరగనట్టు నేరుగా వెళ్లి తరగతి గదిలో కూర్చున్నది. పాఠాలు వినసాగింది. రక్తస్రావమైన విషయాన్ని కళాశాల అధ్యాపకులు, సిబ్బంది గుర్తించారు. వెంటనే తల్లిని, బిడ్డను ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యుల చికిత్స అందించారు. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమమని చెప్పారు.

